News August 14, 2024
ఆదోని: స్వల్పంగా పెరిగిన పత్తి ధర
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7749 పలికింది. సోమవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,000, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,280 కనిష్ఠ ధర రూ.3,449 పలికింది. మార్కెట్‌లో 509 క్వింటాళ్ల పత్తి, 3320 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News January 15, 2025
పండగ రోజు విషాదం.. వెల్దుర్తిలో చిన్నారి మృతి
కర్నూలు బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ. గిరి (10) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిల కుమారుడు గిరి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యప్తు చేపట్టారు.
News January 15, 2025
నంద్యాల: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. ప్రేమ వ్యవహారమే కారణమా?
కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అంబటి రామచంద్రారెడ్డి, శివగంగ దంపతుల కుమారుడు శివరాఘవరెడ్డి(25) అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాఘవరెడ్డి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు పేర్కొంటున్నారు.
News January 15, 2025
జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం తూర్పు ప్రాతకోటలో వెలసిన నాగేశ్వరస్వామి సంక్రాంతి తిరుణాళ్ల సందర్భంగా జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హైకోర్టు న్యాయమూర్తి ఎన్.హరినాథ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల శేషమ్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 12 మహిళా జట్లు పాల్గొన్నాయి.