News March 18, 2024

ఆమదాలవలస: ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నియమావళి పై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పోటీలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సక్రమంగా సమర్పించాలన్నారు. సమస్యలుంటే 90323 18521 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

Similar News

News April 2, 2025

వజ్రపుకొత్తూరు: ఒడ్డుకు కొట్టుకొచ్చిన మత్స్యకారుల మృతదేహాలు

image

సముద్రంలో గల్లంతైన వజ్రపుకొత్తూరు(M) మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు బీచ్‌ల వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. బుంగ ధనరాజు, వంక కృష్ణా గల్లంతై మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News April 2, 2025

ఎచ్చెర్ల: జిల్లా గ్రామీణాభివృది సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

శ్రీకాకుళం జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ,  సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 7 వరకు 4 శిక్షణా కేంద్రాల్లో తర్ఫిదుకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు D.R.D.A ప్రతినిధి p. కిరణ్ కుమార్ తెలిపారు. ఎంపిక ప్రక్రియకు 10th, ఇంటర్మీడియట్ విద్యార్హతలు ఉండాలి అని తెలిపారు.

News April 2, 2025

SKLM: వివరాలు తెలిపిన వ్యక్తికి బహుమతి

image

జలుమూరు మండలంలో మార్చి 29వ తేదీ రాత్రి వివిధ ఆలయాల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాతలు రాశారు. ఈ మేరకు స్పందించిన ఎస్పీ, రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియజేసిన వారికి రూ. 25వేల నగదు పురస్కారం బహుమతిగా ఇస్తామని మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

error: Content is protected !!