News February 7, 2025

ఆరు సెక్టార్లుగా బందోబస్తు: SP కృష్ణారావు

image

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థం జరిగే ప్రాంతాన్ని ఆరు సెక్టార్లుగా విభజించామని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలుజరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు ప్రసాద్, మురళీమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 7, 2025

DON’T MISS.. నెలకు రూ.15,000 స్టైఫండ్‌తో శిక్షణ

image

బీటెక్, BE, BSc Engg, ఎంటెక్, MSc, MBA, MA విద్యార్థులకు IIT మద్రాస్ శుభవార్త చెప్పింది. వారు నైపుణ్యాలను పెంచుకునేందుకు 2 నెలలపాటు(మే 19 నుంచి జులై 18 వరకు) సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి <>https://ssp.iitm.ac.in/<<>>ను సంప్రదించగలరు.

News February 7, 2025

శ్రేయస్ అయ్యర్ ఆటతో భారత్ గెలిచింది: జహీర్ ఖాన్

image

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను మాజీ పేసర్ జహీర్ ఖాన్ కొనియాడారు. ‘శ్రేయస్ ఆట చాలా చూడముచ్చటగా అనిపించింది. రెండు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరో వికెట్ పడి ఉంటే ఛేజింగ్ ఇబ్బంది అయ్యేదే. ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి బంతి ఎలా గింగిరాలు తిరిగిందో చూశాం. కానీ తన దూకుడైన ఆటతో అయ్యర్ ఛేదనను సులువు చేసేశారు’ అని ప్రశంసించారు.

News February 7, 2025

సంగారెడ్డి: సర్వే డబ్బుల కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో నిర్వహించిన సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యుమరేటర్లకు డబ్బులు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సర్వే పూర్తై రెండు నెలలు అయినా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఎన్యుమరేటర్లకు త్వరగా డబ్బులు చెల్లించేలా చూడాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!