News March 27, 2025
ఆర్టీసీ కార్మికుల సేవలు భేష్: ఖమ్మం కలెక్టర్

ప్రజల జీవన వ్యవస్థ సజావుగా సాగేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కొనియాడారు. ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడి పని చేస్తున్నారని, ప్రస్తుత వేసవిలో వారికి ఉపయోగపడే విధంగా జిల్లా యంత్రాంగం తరుఫున 650 బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 1, 2025
రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడిగింపు : కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
News April 1, 2025
రేపటి నుంచి క్రయవిక్రయాలు ప్రారంభం..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానున్నదని మార్కెట్ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారాంతపు సెలవు, ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం రేపటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. కావున ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించి తమ పంటను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొని అమ్మకాలు జరుపుకోవాలని పేర్కొన్నారు.
News April 1, 2025
గ్రూప్–1,2,3,4లో సత్తాచాటిన యువకుడు

కామేపల్లి యువకుడు గ్రూప్–1,2,3,4 ఫలితాల్లో సత్తాచాటాడు. గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల కుమారుడు రత్నేశ్వరనాయుడు ఇటీవల విడుదలైన గ్రూప్-1లో రాష్ట్ర స్థాయిలో 277వ ర్యాంక్, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్ సాధించారు. ఆయన ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేదు.