News April 11, 2025
ఆర్మీ మేజర్‌గా మంచిర్యాల బిడ్డ మీనాక్షి గ్రేస్

మేజర్ పదోన్నతి పొందిన మీనాక్షి గ్రేస్‌ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ భారత సైన్యంలో కెప్టెన్ నుంచి మేజర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమె స్వగృహానికి వచ్చారు. నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. దేశ సేవకు చేసిన కృషి ప్రతి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు.
Similar News
News December 15, 2025
‘తీరప్రాంత రైతులకు వరం.. సముద్రపు పాచి సాగు’

సముద్ర తీర ప్రాంతాల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, రైతుల జీవనోపాధికి సముద్రపు పాచి, ఆస్పరాగస్ సాగు ఎంతో కీలకమని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వీటి సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. లవణ భరిత నేలల్లో పెరిగే హలో ఫైటు రకానికి చెందిన సముద్ర ఆస్పరాగస్ ఉప్పునీటి నేలల్లో సులభంగా పెరుగుతుందన్నారు. దీంతో తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.
News December 15, 2025
యాదాద్రి: నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పు

యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో నిత్య కైంకర్యాల సమయవేళల్లో మార్పు చేశారు. ఉదయం 3:30లకు సుప్రభాతం, 4:00 నుంచి 4:30 వరకు తిరువారాధన, 4:30 నుంచి 5 వరకు తిరుప్పావై సేవా కాలం, 5 గంటల నుంచి 6 గంటల వరకు నివేదన చాత్మర, 6 గంటల నుంచి 7 గంటల వరకు నిజాబీ అభిషేకం, 7 గంటల నుంచి 7:45 వరకు సహస్రనామార్చన, 7:45 తర్వాత ధర్మ దర్శనాలు ప్రారంభమవుతాయి.
News December 15, 2025
చేగుంట శివారులో మృతదేహం గుర్తింపు

మెదక్ జిల్లా చేగుంట గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బాలాజీ వెంచర్‌లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడు అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


