News April 6, 2025
ఆర్మూర్: పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన సీపీ

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. ఇక్కడి పిరమిడ్ విశిష్టతను సీపీకి వివరించామని PSSM జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ, PSSM సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2025
ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉంది: షబ్బీర్ అలీ

ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. వక్ఫ్ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించిందన్నారు.
News April 17, 2025
NZB: రెండు రోజులు జాగ్రత్త..!

గత వారం పదిరోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనాలు సతమతమవుతున్నారు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ మేరకు రేపు ఎల్లుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 17, 2025
లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: MLC కవిత

భీంగల్‌లో BRS పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీని డిమాండ్ చేశారు. అలాగే BRS కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని ఆమె X లో డిమాండ్ చేశారు. లాఠీచార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదన్నారు.