News January 25, 2025
ఆర్మూర్ : ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.
Similar News
News January 26, 2025
NZB: మొదటి బహుమతి సాధించిన షేక్ అమీనా
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
News January 26, 2025
NZB: మందకృష్ణకు శుభాకాంక్షలు: MLC కవిత
పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణ అని కొనియాడారు. ఆయనకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
News January 26, 2025
NZB: నాలుగు పథకాలు ప్రారంభించే గ్రామాలు ఇవే
NZB జిల్లాలోని 31 గ్రామాల్లో ఆదివారం నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. పలు గ్రామాలను అధికారులు ప్రకటించారు. మిర్దపల్లి, కోమన్ పల్లి, జలాల్పూర్, లింగాపూర్, లంగ్డపూర్, గన్పూర్, సీతయ్ పేట్, కమలాపూర్, గంగసముందర్, అన్సన్ పల్లి, నారాయణపేట, ముల్లంగి బి, కొడిచెర్ల, తిమ్మాపూర్, నర్సింపల్లి మల్కాపూర్, డొంకల్, వేంపల్లి, చిన్న వాల్ గోట్, జైతాపూర్ తో పాటు మిగతా గ్రామాల్లో పథకాలను అధికారులు ప్రారంభించనున్నారు.