News August 16, 2024

ఆర్యవైశ్యులకు అన్ని రకాల సహకరిస్తా: ఎంపీ రఘునందన్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్యవైశ్యులందరికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేటలోని ఆర్యవైశ్య భవనం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత, బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Similar News

News September 30, 2024

MDK: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
మెదక్: 2720 136 1:20
సంగారెడ్డి: 3352 234 1:14
సిద్దిపేట: 3246 157 1:20

News September 30, 2024

సిద్దిపేట: ‘జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి’

image

సిద్దిపేట జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 15 వరకు జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకుని ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని సూచించారు. డీజేల నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.