News December 16, 2024

‘ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 ఇవ్వాలి’

image

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా కార్యకర్తల బస్సు యాత్ర సోమవారం మధ్యాహ్నానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలన్నారు.

Similar News

News February 5, 2025

ADB: రైలు పట్టాలపై పడి మృతి

image

తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్‌వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్‌తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.

News February 5, 2025

నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

image

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!