News March 14, 2025
ఆసిఫాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆసిఫాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News March 15, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

✓ ధర్మసాగర్: వ్యక్తి అనుమానస్పద మృతి
✓ రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
✓ భార్యను చంపిన భర్తకు రిమాండ్(UPDATE)
✓ హనుమకొండలో రేషన్ బియ్యం పట్టివేత
✓ ఉనికిచర్ల శివారులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✓ HNK: వాహన తనిఖీలు నిర్వహించిన సుబేదారి పోలీసులు
✓ HNK: ATM సెంటర్ల వద్ద పోలీసుల ప్రత్యేక నిఘా
News March 15, 2025
కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీంతో అధికార లిబరల్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ విజయం సాధించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన వేళ కార్నీకి పెను సవాళ్లు ఎదురు కానున్నాయి.
News March 14, 2025
తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి: పవన్ కళ్యాణ్

AP: హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ భాషలు వద్దా? భాషలపై వివక్ష ఎందుకు? సంస్కృతం, హిందీ మన భాషలే కదా? పనిచేసేవాళ్లు బిహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా?’ అని పవన్ ప్రశ్నించారు.