News March 3, 2025

ఆసిఫాబాద్‌: ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా

image

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల దృశ్య ఓట్ల లెక్కింపు కారణంగా ప్రజా ఫిర్యాదుల విభాగం సోమవారం వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు.

Similar News

News March 3, 2025

చిగురుమామిడి: హైనా దాడిలో లేగదూడ మృతి

image

కొండాపూర్ గ్రామానికి చెందిన చీకుట్ల రాజు అనే రైతు లేగ దూడపై హైనా దాడి చేసింది. రోజులాగే తన వ్యవసాయ పొలం వద్ద లేగదూడను కట్టివేసి ఇంటికి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి లేగ దూడ చనిపోయియిందన్నాడు. హైనా చంపిన ఆనవాళ్లను గుర్తించామని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతుకోరాడు. రైతులు తమ పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కంచె ఏర్పాటు చేసుకోవాలని ఫారెస్ట్ అధికారి శేఖర్ రైతులకు తెలిపారు.

News March 3, 2025

HYD: GIS సర్వేతో రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం..!

image

గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో పన్ను పరిధిలోలేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాల లెక్కతేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్టు, క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75 లక్షలు ఉండొచ్చని అంచనా.

News March 3, 2025

రాజమండ్రి: హత్య కేసులో జీవిత ఖైదు

image

2021 సెప్టెంబర్‌లో  రాజమండ్రిలోని సీటీఆర్ఐ సెంటర్ వద్ద జరిగిన హత్య కేసులో ఒక నేరస్థుడికి సోమవారం కోర్టు శిక్ష విధించింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఆర్.శ్రీలత ముద్దాయి యర్రా సాయికి జీవితకాలం ఖైదు అలాగే రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసు పురోగతిలో సహకరించిన పీపీ రాధాకృష్ణరాజు, త్రీ టౌన్ సీఐ అప్పారావు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లులను, ఎస్పీ నర్సింహ కిషోర్‌ను కోర్టు అభినందించింది.

error: Content is protected !!