News May 2, 2024
ఆస్తి పన్ను వసూలులో నల్గొండ టాప్
ఐదు శాతం రాయితీ అవకాశాన్ని నకిరేకల్ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. అక్కడ 51 శాతం ఆస్తి పన్ను వసూలైంది. చండూరు మున్సిపాలిటీలో మాత్రం అతి తక్కువ మంది ఆస్తి పన్ను చెల్లించారు. నల్గొండలో రూ.6,66,66,000, మిర్యాలగూడలో రూ.2,51,87,000, దేవరకొండలో రూ.63,35,867, చండూరులో రూ.12లక్షలు, చిట్యాలలో రూ.56లక్షలు, హాలియాలో రూ.5,49,55,000, నకిరేకల్లో రూ.2.66 కోట్ల ఆస్తి పన్ను వసూలు అయ్యింది.
Similar News
News December 27, 2024
భువనగిరితో మన్మోహన్ సింగ్‌కు అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు భువనగిరితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ 26న ఏర్పాటుచేసిన ప్రచార వేదిక సభకు హాజరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మన్మోహన్ సింగ్‌కు స్వాగతం పలికారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లును పరిచయం చేశారు.
News December 27, 2024
రాజాపేట: వారం పాటు పోరాడిన దక్కని చిన్నారి ప్రాణం
ఇంట్లో ఆడుకుంటుండగా కట్టెలపొయ్యి మంటలు అంటుకుని చిన్నారికి ఈ నెల 20న గాయాలవగా HYD గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప గురువారం మృతిచెందింది. పోలీసుల వివరాలిలా.. రాజాపేట మండలం రేణిగుంటకి చెందిన ఎర్ర పరమేశ్, స్వప్న దంపతుల కుమార్తె సాక్షి (3) ఇంట్లో ఆడుకుంటుండగా మంట అంటుకుంది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజాపేట పోలీసులు తెలిపారు.
News December 26, 2024
NLG: అటు ముసురు.. ఇటు చలి తీవ్రత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది. చలి తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.