News February 25, 2025
ఇంటర్ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: ASF కలెక్టర్

జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
News February 25, 2025
HYD: పబ్‌లో యువతిపై ఎక్స్ లవర్ దాడి

జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
News February 25, 2025
టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.