News April 22, 2025
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో నిర్మల్‌కు 20వ ర్యాంక్

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో 58.78% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 20వ స్థానం సాధించినట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. బాలురు 2421 పరీక్షకు హాజరుకాగా 1054 (43.54) ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలికలు 3062 పరీక్షరాయగా 2169 (70.84) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఓవరాల్‌గా 5483 విద్యార్థులు పరీక్ష హాజరుకాగా 3223 విద్యార్థులు 58.78 శాతంతో ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News April 23, 2025
మెదక్: ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ పరీక్షా ఫలితాల్లో రేగోడ్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి వెన్నెల ప్రణీత్ కుమార్ 470 మార్కులకు గాను 467 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించాడు. ప్రణీత్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి విద్యలో ఉత్తమ ప్రతిభ పాటవాలు కనబరుస్తున్నాడు.
News April 23, 2025
HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లభించింది. TMRJC ఖైరతాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కులకు గాను 495 మార్కులు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
News April 23, 2025
అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అమర్నాథ్

అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమర్నాథ్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అమర్నాథ్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.