News February 19, 2025
ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.
Similar News
News December 21, 2025
అనంత, హిందూపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షులు వీరే..!

టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం లోక్‌సభ అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్ చౌదరిని నియమించారు. హిందూపురం లోక్‌సభ అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ప్రధాక కార్యదర్శిగా హనుమప్పను నియమించారు.
News December 21, 2025
NLG: ఆ నిధులు వస్తేనే జీపీలకు వెసులుబాటు

పంచాయతీల్లో అభివృద్ధి పనులకు నిధుల లేమి అడ్డంకిగా మారనుంది. కేంద్ర నిధులతో సమానంగా ఒక్క ఏడాది నిధులిచ్చి గత ప్రభుత్వం చేతులెత్తేసింది. 2023 నుంచి కేంద్రం నుంచి నిధులు రాలేదని మాజీ సర్పంచ్ లు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,782 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడేళ్లుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కొత్త పాలకవర్గాలకు కొంత వెసులుబాటు కలుగుతుందని తాజా సర్పంచులు అంటున్నారు.
News December 21, 2025
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజావాణి రద్దు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో 22న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్
మనుచౌదరి పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరంలో శీతాకాల విడిది ముగించుకొని తిరిగి సోమవారం ఢిల్లీ వెళ్తుండటంతో ఏర్పాట్ల పనులలో జిల్లా యంత్రాంగం, అధికారులు నిమగ్నమై ఉండటంతో రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమాచారాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు.


