News April 25, 2024

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో హైదరాబాద్ ఇలా..

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో హైదరాబాద్ 3 జోన్లు 11, 19, 14వ స్థానంలో నిలిచాయి. HYD-1 జోన్ 67.12 శాతంతో 11వ స్థానంలో నిలిచింది. 27,514 మంది పరీక్షలు రాయగా 18,468 మంది పాసయ్యారు. HYD-2వ జోన్ 64.85 శాతంతో 19వ స్థానంలో నిలిచింది. 34,426 మంది పరీక్షలు రాయగా 22,326 మంది పాసయ్యారు. HYD-3వ జోన్ 65.59 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. 11,193 మంది పరీక్షలు రాయగా 7,341 మంది ఉత్తీర్ణత సాధించారు.

Similar News

News January 8, 2025

సికింద్రాబాద్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్‌ హెడ్ క్వార్టర్స్‌‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌‌‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT

News January 8, 2025

HYD: లవర్స్ సజీవదహనం (UPDATE)

image

ఘట్‌కేసర్ PS పరిధి ORR సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు శ్రీరామ్(25) ఫోన్ నుంచి అమ్మాయి(17) వాట్సాప్‌లో లైవ్ లొకేషన్‌తో పాటు 3 పేజీల లెటర్‌ను ఆమె తండ్రికి సెండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందే అన్నోజిగూడలోని ఓ దుకాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. బాలిక తండ్రి వారున్న లొకేషన్‌ వెళ్లేసరికి కూతురు, శ్రీరామ్ మంటల్లో <<15087962>>సజీవదహనమయ్యారు<<>>.

News January 8, 2025

HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు

image

అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.