News February 2, 2025
ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి సిద్దిపేట విద్యార్థులు
దుబాయ్‌లో ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ(U-19)కి సిద్దిపేటకు చెందిన పవనసుత హనుమాన్, లక్ష్మి మణికాంత్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు, క్రికెట్ అకాడమీ కోచ్ ముత్యాల ఆనంద్‌ను శనివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్లో విజయాలను సాధించాలన్నారు.
Similar News
News February 2, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీని ప్రకారం రేపు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి రేపు సెలవు ఉన్నట్లు మీకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.
News February 2, 2025
పాలకొండ: హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి
హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా, ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.