News February 24, 2025

ఇండియా-పాక్ మ్యాచ్‌‌లో జేసీ పవన్

image

టీడీపీ సీనియర్ నేత జేసీ పవన్ రెడ్డి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగిన టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌‌ను తిలకించారు. తన స్నేహితులతో కలిసి గ్రౌండ్‌లో సందడి చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే మ్యాచ్‌ను చూడటానికి మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు వెళ్లిన విషయం తెలిసిందే.

Similar News

News February 24, 2025

అనంతపురానికి సరైన బెర్త్ దక్కేనా?

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉరవకొండ నుంచి 5వసారి గెలుపొంది తొలిసారి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్ ఈ నెల 28న కూటమి ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మన జిల్లా నేత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి పయ్యావుల పద్దులో అనంతపురం జిల్లాకు సరైన బెర్త్ దక్కేనా?

News February 24, 2025

అనంతపురం జిల్లాలో 48,690 మంది ఇంటర్ విద్యార్థులు

image

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతపురం జిల్లాలో 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 25,730 మంది, రెండో సంవత్సరం 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

News February 23, 2025

అనంతపురం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు ఇవే..!

image

☞ అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు – కలెక్టర్ వినోద్ కుమార్ ☞ పెద్దపప్పూరులో అశ్వర్థం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ☞ అనంతపురం రూరల్‌లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత భూమి పూజ☞ గుత్తిలో ఇరు వర్గాలు ఘర్షణ ☞ కుందుర్పిలో గడ్డివాములు దగ్ధం ☞ గార్లదిన్నె మండలంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు☞ తాడిపత్రిలో సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి

error: Content is protected !!