News February 26, 2025
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అతిరుద్ర మహా యజ్ఞానికి చోటు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 14 నుంచి 25 వరకు జరిగిన అతిరుద్ర మహా యజ్ఞం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దాదాపు 83 దేశాలకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అతిరుద్ర మహా యజ్ఞాన్ని తిలకించారని నిర్వాహకులు తెలిపారు. సత్య సాయి ట్రస్టు సభ్యులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు.
Similar News
News February 27, 2025
వరంగల్: బాలాజీనగర్లో గోమాతకు శ్రీమంతం

గోమాతకు శ్రీమంతం నిర్వహించిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎనుమాముల రోడ్డులోని బాలాజీ నగర్లో బుధవారం జరిగింది. శ్రీకైలాస ఈశ్వర ప్రభక్త ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోమాతకు శ్రీమంతం పూజా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న వకలా మాత గోవు గర్భం దాల్చగా ఆలయ భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News February 27, 2025
స్టేషన్ ఘనపూర్: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన రాజు-అపర్ణలు తమ తకూరు తపస్వి(4)తో కలిసి అపర్ణ తల్లిగారి ఊరైన స్టే.ఘ.లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడింది. గమనించిన అపర్ణ వెంటనే తన కూతురిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News February 27, 2025
రికార్డు సృష్టించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.