News April 23, 2025
ఇందన్‌పల్లి బీట్ ఆఫీసర్‌పై దాడి.. ఇద్దరి రిమాండ్

ఇందన్‌పల్లి అటవీ అరేంజ్ పరిధిలోని భర్తనిపేట బీట్ ఆఫీసర్ రుబీనాతలాత్‌పై దాడి చేసిన మహమ్మద్ రియాజుద్దీన్, ఇజాజుద్దీన్‌లను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి వారికి 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా, కలప అక్రమ రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 23, 2025
హైడ్రా లోగో మార్చిన అధికారులు

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) లోగో మారింది. గ్రాన్డియర్ లుక్లో పాత లోగో ఉండగా.. వాటర్ వర్క్స్ విభాగాన్ని తలపించేలా కొత్త లోగో రూపొందించారు. ప్రస్తుతం ఈ కొత్త లోగోనే హైడ్రా తన అధికారిక X అకౌంట్ హ్యాండిల్‌కు DPగా ఉపయోగించింది.
News April 23, 2025
ఓయూ భవనానికి ట్రేడ్ మార్క్ గుర్తింపు

ఉస్మానియా యూనివర్సిటీ ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో నిర్మాణ శైలి చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్‌హోటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన 3వ కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది.
News April 23, 2025
HYDలో మ.12 వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే!

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.68% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది.