News March 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలి: వనపర్తి కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎంపికైన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
Similar News
News December 27, 2025
VZM: ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి

2013వ సంవత్సరం బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు సెలెక్షన్ గ్రేడ్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌కు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి ఇచ్చి, ఇదే జిల్లాలో సీనియర్ ఎస్పీగా కొనసాగాలని శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి సందర్భంగా జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్పీకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 27, 2025
టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు

NTR ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని CM CBN ప్రశంసించారు. HYDలో జరిగిన NTR ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చమత్కరించారు. ఇక చిన్నప్పుడు తనను చాలామంది IAS చదవమన్నా తాను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని చెప్పారు.
News December 27, 2025
జగిత్యాల: దారుణ హత్య.. కొనసాగుతున్న దర్యాప్తు

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మృతుడిని పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌గా స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.


