News October 2, 2024

ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశాం: EO

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభిస్తున్నామని ఆలయ EO కెఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశామన్నారు. ఉత్స‌వాల‌కు 15 లక్షల‌ మంది వ‌ర‌కూ వ‌స్తార‌ని అంచ‌నా వేశామన్నారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు చండీయాగం నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 3, 2024

నేడు బాలా త్రిపుర సుంద‌రీదేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

image

దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా తొలి రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి గురువారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారని పండితులు తెలిపారు. ఈ రోజున 2 నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావిస్తారు.

News October 2, 2024

మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాము: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ గంగాధర్ రావు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కోసమే జీవించి దేశం కోసమే మరణించిన వ్యక్తులలో లాల్ బహుదూర్ శాస్త్రి ఒకరని తెలిపారు.

News October 2, 2024

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS), హైదరాబాద్(HYD) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.07631 HYD- NS ట్రైన్‌ను OCT 5 నుంచి NOV 30 వరకు ప్రతి శనివారం, నం.07632 NS- HYD ట్రైన్‌ను OCT 6 నుంచి DEC 1 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ ట్రైన్లు జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయి.