News November 21, 2024
ఇచ్చాపురం: పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఇచ్చాపురం టౌన్ పోలీసు స్టేషన్ సందర్శించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణాన్ని, పోలీసు స్టేషన్లోని గదులను, ప్రాపర్టీ రూం, లాకప్ గదులను పరిశీలించారు. పోలీసు స్టేషన్లోని ముఖ్యమైన రికార్డులు, కేసు ఫైల్స్‌ను తనిఖీ చేసి ముఖ్యమైన కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News November 21, 2024
SKLM: గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించాలి
ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గృహ నిర్మాణశాఖ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టరేట్‌లో గురువారం సమావేశంలో నిర్వహించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5 వేల గృహాలు, ఏడాదిలోపు 35 వేల గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
News November 21, 2024
గార: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ.. ఒకరు మృతి
గార మండలం వమరవిల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే స్థానిక మండలం తోనంగి గ్రామానికి చెందిన కృష్ణారావు, గణేశ్ గురువారం మధ్యాహ్నం స్కూటీతో అతివేగంతో వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ తాకిడికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు.
News November 21, 2024
శ్రీకాకుళం జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు వినతి.. మంత్రి ఏమన్నారంటే?
ఎచ్చెర్లలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు. విశాఖకే కాకుండా ఐటీ పార్క్‌ను వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సైతం విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్లకు దగ్గరలో అంతర్జాతీయ విమానశ్రయం, హైవే కనెక్టివిటీ, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. టైర్2, టైర్ 3 సిటీల్లోనూ ఎకో వర్కింగ్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.