News June 10, 2024

ఇచ్ఛాపురం MLA అశోక్ బాబు 40 అడుగుల కటౌట్

image

ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో స్థానిక బస్టాండ్‌ కూడలి వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికలో గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ 40 అడుగుల ఎత్తు గల భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమాని తెలిపారు. ఈ సారి తమ అభిమాన నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News May 7, 2025

శ్రీకాకుళం జిల్లాకు వరాలు కురిపిస్తారా?

image

మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు CM చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పి వలసలు అరికట్టేలా ఏదైనా ప్రకటన చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైడిభీమవరంలో పారిశ్రామికవాడ, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, కొవ్వాడ అణువిద్యుత్ పరిశ్రమ పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

News May 7, 2025

శ్రీకాకుళం: 27న మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మేనేజర్ ఉరిటి సాయి కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 27వ తేదీ చేపడుతున్న ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, బి.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల లోపు వారు మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు.

News May 7, 2025

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

image

సికింద్రాబాద్ గోపాలపురం PS పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం(M) చాకిపల్లికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు.. మేడ్చల్ హనుమాన్ నగర్‌‌లో ఉంటున్న సీహెచ్ నవీన్ (27) శుక్రవారం ఓ వేడుకకు వెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతుండగా సికింద్రాబాద్ YMCA ఫ్లై ఓవర్ వద్ద ఇనుప స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా నవీన్‌కు ఈ నెల 13న వివాహం జరిగింది.

error: Content is protected !!