News March 11, 2025

ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

image

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.

Similar News

News March 12, 2025

విశాఖ: అమ్మతో పేగు బంధం.. భగవంతుడితో అనుబంధం..!

image

జన్మనిచ్చిన తల్లికి తండ్రి కొనిచ్చిన స్కూటర్‌పై దేశమంతా తిప్పి చూపించాడు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవాలయ దర్శనాలు చేపించాడు మైసూర్‌కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. తన తల్లి చూడారత్నమ్మ కోరిక మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆలయాలకు స్కూటర్ పైనే తిప్పాడు. తల్లికిచ్చిన మాట కోసం ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వీరిద్దరూ బుధవారం విశాఖ చేరుకున్నారు.

News March 12, 2025

విశాఖలో విచ్చలవిడిగా గుట్కా..!

image

విశాఖనగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా లభిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఒడిశా నుంచి రైలు మార్గంలో ఖైని, గుట్కా, పాన్ మసాలాలు విశాఖకు చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధురవాడ, ఆరిలోవ, వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలలో ఏ దుకాణంలో చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఆహారభద్రత అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 12, 2025

గాజువాకలో వైసీపీ నాయకుడిపై కేసు 

image

వైసీపీ కార్పొరేటర్‌గా పోటీ చేసిన దొడ్డి రమణతో పాటు మరో ముగ్గురు అకారణంగా దూషించి మతిస్థిమితం లేని తన కుమార్తెపై దాడి చేశారని ఓ మహిళ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 64వ వార్డుకు చెందిన దొడ్డి రమణ, మంత్రి మంజుల వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్నారు. దేవాలయంలో హుండీ పోగా.. దార రమణమ్మ కొడుకు దొంగలించాడంటూ గతనెల 28న దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో సీఐ పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!