News May 22, 2024

ఇన్‌ఛార్జి వీసీగా మంత్రి శ్రీధర్ బాబు సతీమణి

image

తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ మంగళవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కాగా లిస్టులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్ ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అయిన శైలజా రామయ్యర్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వీసీగా ప్రభుత్వం నియమించింది.

Similar News

News October 2, 2024

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి: మాజీ MLA సతీశ్ కుమార్

image

మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కొండా సురేఖకు కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని సతీష్ డిమాండ్ చేశారు.

News October 2, 2024

కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు. మూసీపై బీఆర్ఎస్ వైఖరిని తెలపాలన్నారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని అన్నారు.

News October 2, 2024

విజయభారతికి నివాళులర్పించిన కేటీఆర్

image

ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా తల్లి, ప్రముఖ రచయిత్రి విజయభారతి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాహుల్ బొజ్జ నివాసానికి వెళ్లి వారీ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విజయ భారతి మరణం బాధాకరమని ఆవేదన చెందారు. విజయభారతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.