News March 13, 2025

ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

image

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.

Similar News

News March 13, 2025

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 586 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 586 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి బి.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 11,419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,083 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,364 మంది హాజరు కావలసి ఉండగా 2,114 మంది హాజరైనట్లు తెలిపారు.

News March 13, 2025

ఆదిలాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

image

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2025

బాపట్ల: ఆర్టీసీ బస్సుల్లో టెన్త్ విద్యార్థులకు ఫ్రీ జర్నీ

image

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 16,799 (8482 విద్యార్థులు, విద్యార్థినిలు 8317) మంది 103 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హాల్ టికెట్‌పై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.

error: Content is protected !!