News December 1, 2024

ఇబ్బందులు ఉన్నాయా.. కాల్ చేయండి: కోనసీమ కలెక్టర్

image

కోనసీమ జిల్లాలోని ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు 94416 92275, 83094 32487 నంబర్లకు ఫోన్ చేసి వారి సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు.

Similar News

News December 27, 2024

తూ.గో: న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ కీలక సూచనలు

image

న్యూ ఇయర్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని తూ.గో. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. కొవ్వూరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్పీ తనిఖీలు చేశారు. మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సైలెన్సర్లు పీకి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలని సూచించారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు.

News December 26, 2024

శంఖవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

శంఖవరం మండలం వేలంగి-పెద్దమల్లాపురం మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం పోలీసుల వివరాల మేరకు.. పెదమల్లాపురానికి చెందిన బోడోజు వెంకట రమణ (18), బలుం సుబ్రహ్మణ్యం (24) బైక్‌పై వేళంగి నుంచి పెదమల్లాపుంకు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 26, 2024

తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి

image

తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి ఝాన్సీ రాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.