News May 19, 2024
ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం.. ASI పరిస్థితి విషమం

ఇబ్రహీంపట్నంలో శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రమణకు తీవ్ర గాయాలయ్యాయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కారు కాలేజ్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న రమణను ఢీకొట్టింది. ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ సాదిక్ హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 23, 2025
కృష్ణా: ధరిత్రిని కాపాడుకుందాం- కలెక్టర్

జిల్లా ప్రజలు ధరిత్రిని కాలుష్యం నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరిత్రి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పర్యావరణ అవగాహన కార్యక్రమం అని పేర్కొన్నారు.
News April 22, 2025
కృష్ణాజిల్లాలో ఉత్కంఠత

పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 25,259మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థులు 21,009, ప్రైవేట్, ఒకేషనల్ విద్యార్థులు 4,250 మంది ఉన్నారు. రేపు విడుదలయ్యే పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
News April 22, 2025
కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.