News March 4, 2025
ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 4, 2025
జనగామ: ప్రైవేట్ వైద్యుడి ARREST

టిప్పు సుల్తాన్ వారసుడినని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజా ప్రస్తుతం టిప్పు సుల్తాన్ అనే ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. అలాగే జనగామలో కేకే పేరుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. సుమారు రూ.55 కోట్లకు పైగా ప్రజలను మోసం చేశారని పలువురు చెబుతున్నారు.
News March 4, 2025
దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్ష రాసిన విద్యార్థి

తమిళనాడులో సునీల్ అనే విద్యార్థి తన తల్లి మరణంలోనూ తన కర్తవ్యాన్ని వీడలేదు. సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించింది. అదే రోజు ఇంటర్ పరీక్షలు మెుదలు. నీ భవిష్యత్తే తల్లి కోరుకునేదని, పరీక్ష రాయాలని బంధువులు ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్ష రాసాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.