News April 7, 2025
ఇల్లందకుంట: పట్టు వస్త్రాలు సమర్పించిన బండి సంజయ్

ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
News April 8, 2025
PDPL: కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43) దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.
News April 7, 2025
KNR: ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 881 మంది విద్యార్థులకు 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.