News March 22, 2025

ఇల్లందు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం: జీఎం కృష్ణయ్య

image

బొగ్గు ఉత్పత్తిలో 2025 ఆర్థిక సంవత్సరానికి ఇల్లందు ఏరియాకు కేటాయించిన 41.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 11రోజుల ముందుగానే అధిగమించామని ఏరియా జీఎం కృష్ణయ్య తెలిపారు. మార్చి నాటికి ఏరియాకు కేటాయించిన దానికంటే ఎక్కువగా శుక్రవారం 41.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 100.12% అన్ని ఏరియాలకంటే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఇల్లందు ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

Similar News

News December 17, 2025

లేటెస్ట్ మూవీ అప్డేట్స్

image

*రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి ఈరోజు రెండో సాంగ్ విడుదల. సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్మాతలు.
*విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్‌ తెరకెక్కిస్తోన్న ‘రౌడీ జనార్ధన’ టీజర్ విడుదల 22వ తేదీకి వాయిదా.
*మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక మూవీ “వృష‌భ‌” ఈ నెల 25న విడుదల కానుంది.

News December 17, 2025

ఖమ్మం: ఓటు వేసి వస్తూ గుండెపోటుతో మృతి

image

సత్తుపల్లి మండలం బేతుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని ఇంటికి వెళ్తున్న నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News December 17, 2025

సిరిసిల్లలో 11 గంటల వరకు 46.80 శాతం పోలింగ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో 47.30 శాతం, వీర్నపల్లి 56.17, ముస్తాబాద్ 41.57 శాతం, గంభీరావుపేట 48.84 శాతం పోలింగ్ నమోదయింది. 1,25,324 మంది ఓటర్లకు గాను 58,653 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 46.80 శాతం పోలింగ్ నమోదయింది.