News April 17, 2025
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 1606 దరఖాస్తులు: జేసీ

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఆన్ లైన్లో 1606 దరఖాస్తులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. దరఖాస్తులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉందని అన్నారు. 2019 అక్టోబర్ 15కి ముందు ఉన్న ఆక్రమణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తుదారులు.. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, నీటి చార్జీ రసీదులను సమర్పించాలన్నారు.
Similar News
News April 20, 2025
కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు నిరూపించాలి: V.M.R.D.A ఛైర్మన్

G.V.M.C.ఎన్నికల్లో కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దాన్ని నిరూపించాలని V.M.R.D.A ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. అవిశ్వాసంలో ధర్మబద్ధంగా నెగ్గామన్నారు. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేయని అరాచకం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇకపై జీవీఎంసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News April 20, 2025
అవిశ్వాసంతో పదవి కోల్పోయిన విశాఖ తొలి మేయర్

అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన మొదటి మేయర్‌గా హరివెంకట కుమారి నిలిచారు. విశాఖ మున్సిపాలిటీ 1979లో కార్పొరేషన్‌గా మారింది. 1981లో జరిగిన ఎన్నికల్లో మొదటి మేయర్‌గా N.S.N.రెడ్డి(1981-1986) గెలిచారు. అనంతరం 1987లో D.V సుబ్బారావు, 1995లో సబ్బం హరి, 2005లో రాజాన రమణి మేయర్లుగా పనిచేశారు. 2005లో G.V.M.C ఆవిర్భవించినాక 2007లో మేయర్‌గా జనార్దనరావు ఎన్నికయ్యారు. 2021లో హరివెంకట కుమారి పదవి చేపట్టారు.