News October 16, 2024

ఇసుక సరఫరాను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఇసుకను వినియోగదారులకు ఆఫ్‌లైన్ బుధవారం నుంచి ప్రారంభించినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చిన్న రాముడుతో కలిసి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ కోసం, ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎటువంటి ఆటంకం లేకుండా ఇసుక సరఫరా విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు.

Similar News

News October 17, 2024

తూ.గో.: TODAY TOP NEWS

image

* రంపచోడవరం: ‘పులి తిరిగేది ఆ ప్రదేశాల్లోనే.. జాగ్రత్త’
* రాజమండ్రిలో బంగారం దొంగతనం
* కాకినాడలో 13 మందికి జైలు
* కొవ్వూరులో షేర్ యాప్ పేరిట భారీ మోసం
* తుని రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
* కొత్తపేటలో బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్
* కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు
* జగ్గంపేట: మందుబాబులకు నిరాశే..!
* అయినవిల్లి: మద్యం షాపులు వద్దంటూ ఆందోళన
*అల్లవరంలో ఎగసిపడుతున్న సముద్రపు అలలు

News October 16, 2024

కొత్తపేటలో ప్రేమ పేరిట బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

image

కొత్తపేట మండలంలోని అవిడి పెదపేటకు చెందిన కృష్ణబాబు (22) కి 15 రోజులు రిమాండ్ విధించినట్లు DSP వై. గోవిందరావు తెలిపారు. వారి కథనం.. ఓ బాలిక(17)ను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడు. విషయాన్ని బాలిక కుటుంబీకులకు చెప్పడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. DSP విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.

News October 16, 2024

కూనవరం అటవీక్షేత్రంలో పెద్దపులి జాడలు

image

కూనవరం అటవీ క్షేత్ర పరిధిలోని దూగుట్ట, చింతూరు మండలం ఏడుగురాళ్ల పంచాయతీ పరిధిలోని తాటిలంక గ్రామ సమీపంలో పెద్దపులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు మంగళవారం గుర్తించారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పశువులు ప్రమాదానికి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చింతూరు DFO బబిత పరిస్థితిని అటవీ అధికారులతో సమీక్షస్తున్నారు.