News April 2, 2024

ఈ నెల 9నుంచి దుర్గగుడి వసంత నవరాత్రోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 9 నుంచి 18 వరకు, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు సోమవారం తెలిపారు. ఈ నెల 9న స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఉదయం 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారన్నారు. ఉదయం 8.15 గంటలకు లక్ష్మీగణపతి మందిరం వద్ద వసంత నవరాత్రోత్సవాలు కలశస్థాపన, అనంతరం దుర్గమ్మకు పుష్పార్చన ప్రారంభిస్తారన్నారు.

Similar News

News October 6, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా (NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం NTSK-SMVB(నం.05952), నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి సోమవారం SMVB-NTSK(నం.05951)మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News October 6, 2024

విజయవాడలో ‘జనక అయితే గనక’ స్పెషల్ షో

image

ఈ నెల 12న రిలీజ్ కానున్న ‘జనక అయితే గనక’ సినిమా స్పెషల్ షోను ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సినీ హీరో సుహాస్, హీరోయిన్ సంగీర్తన, ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించనున్నారు. షో అనంతరం 3 గంటలకు చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనున్నారు.

News October 6, 2024

కృష్ణా: దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లుపై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.