News October 29, 2024
ఈదుపురంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సభ
సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Similar News
News October 30, 2024
SKLM: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ
సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
News October 29, 2024
శ్రీకాకుళం: ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల
ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల అయింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సందర్శించాలి. నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది.
News October 29, 2024
శ్రీకాకుళం జిల్లాలో జీడీ, మామిడి రైతులకు గుడ్ న్యూస్
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాలలో సాగు చేస్తున్న జీడి, మామిడి రైతులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని జిల్లా ఉద్యానాధికారి రత్నాల వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లిన పంటలకు భీమా పరిహారం పథకం అందుబాటులోకి వచ్చిందన్నారు. సంబంధిత మీ సేవా వద్ద వివరాలు జమచేసి ఇన్సురెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.