News February 6, 2025
ఈనెల 10న డీ వార్మింగ్ డే: కలెక్టర్ అంబేడ్కర్

విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.
Similar News
News December 16, 2025
VZM: హాయ్ అని మెసేజ్ పెడితే చాలు.. ఫోన్‌లోకే సమాచారం

ప్రజలకు పోలీసు సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే FIR, ఎఫ్ఐఆర్ స్థితి, ఈ-చలాన్ వివరాలను ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌లు అందుబాటులో ఉన్నాయని, వినియోగించుకోవాలన్నారు.
News December 16, 2025
విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్‌లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.
News December 16, 2025
VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.


