News April 16, 2024
ఈనెల 18 మడకశిరలో వైఎస్ షర్మిల పర్యటన
మడకశిర మండలంలో ఈనెల 18 పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు మడకశిరలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News January 25, 2025
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: అనంత కలెక్టర్
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలను అన్ని శాఖల అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం కాన్ఫరెన్స్ హాలులో 54వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ డిస్ట్రిక్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలన్నారు.
News January 24, 2025
అనంత: అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
నిత్యవసర సరకుల అక్రమ నిల్వలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో నిత్యవసర సరకులను సరఫరా చేస్తోందన్నారు. అవి లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలని సూచించారు. అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా ఒక ప్రత్యేక బృందం పని చేస్తోందని తెలిపారు. నిత్యవసర వస్తువులు కేవలం పేదలకు మాత్రమే చేరాలన్నారు.
News January 24, 2025
కూడేరు: జైలు నుంచి దున్నపోతు రిలీజ్
కూడేరు మండలం కడదరకుంట, ముద్దలాపురం గ్రామాల్లో దేవర కోసం రెండు దున్నపోతులను గతంలో వదిలారు. అయితే వాటిలో ఒకటి పారిపోగా.. మరొక దానికోసం రెండు గ్రామాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో సీఐ రాజు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ దున్నపోతును వారి ఆధీనంలోకి తీసుకున్నారు . కాగా ఇటీవల దేవర ముగియడంతో గురువారం దున్నపోతును వదిలేశారు. ఇక మీదట బలి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.