News March 16, 2025

ఈనెల 26న వికారాబాద్‌లో వాహనాల వేలం: ఎస్పీ

image

జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వదిలేసిన, గుర్తుతెలియని 148 వాహనాలకు ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో దొరికిన వాహనాలను వికారాబాద్‌లో భద్రపరిచామని, పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను బహిరంగ వేలం నిర్వహిస్తునట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 16, 2025

గ్రూప్-1 ఫలితాల మూల్యాంకనంలో లోపాలు: ప్రసన్న హరికృష్ణ

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడంపై MLC అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని అన్నారు. సబ్జెక్టులపై అవగాహన లేని వారితో వాల్యుయేషన్ చేయించారని, EM బ్లూప్రింట్‌ను TMలోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వడంతో TM వారికి అన్యాయం జరిగిందన్నారు. టాప్-100లో TM, ఉర్దూ మీడియం వారు ఎందరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

News March 16, 2025

BRS తీరును ఖండిస్తూ జిల్లాలో కాంగ్రెస్ నిరసన

image

BRS నాయకులు దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. RR జిల్లా వ్యాప్తంగా KTR, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి, BRS దళిత వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News March 16, 2025

KMR: పేదరికాన్ని జయించాడు. సర్కార్ నౌకరి సాధించాడు

image

గాంధారి మండలం నేరాల తాండకు చెందిన బర్దవాల్ మెగరాజ్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచాడు.  పేదరికంలో పుట్టి పెరిగిన మెగరాజ్ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కష్టపడి ప్రభుత్వ అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు దోమకొండలో ప్రభుత్వ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. కాగా మెగరాజ్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే విద్యనభ్యసించాడు.

error: Content is protected !!