News March 21, 2025

ఈనెల 27న జిల్లా, మండల పరిషత్ సభ్యుల ఎన్నికలు

image

కర్నూలు జిల్లా, మండల పరిషత్‌లలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, MPP పదవుల భర్తీకి ఈనెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సులేమాన్ గతేడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈఏడాది జనవరి 1న మృతిచెందారు. వెల్దుర్తి, తుగ్గలి MPPలు శారద, ఆదెమ్మ రాజీనామా చేశారు. ఈ 4 పోస్టులకు ఈనెల 23న నోటిఫికేషన్ ఇచ్చి, 27న మధ్యాహ్నం సభ్యులను ఎన్నుకుంటారు.

Similar News

News March 31, 2025

కురుపాంలో ఏనుగుల గుంపు సంచారం

image

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కురుపాం మండలం సీతంపేట, పూతిక వలస ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

News March 31, 2025

నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

image

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.

News March 31, 2025

గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్‌గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె MBBS పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు యూపీఎస్సీ, గ్రూప్-1 కోసం సన్నద్ధమయ్యారు. దీపిక తండ్రి కృష్ణ ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆఫీసర్.

error: Content is protected !!