News December 24, 2024

ఈనెల 27న ధర్నా చేస్తాం: విజయసాయిరెడ్డి

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 25, 2024

విశాఖ: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు జనవరి 4న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ కమోడర్ మోహన్ పరిశీలించారు. సీఎం సభాస్థలికి చేరుకునే దగ్గరనుంచి తిరుగు ప్రయాణం అయ్యేవరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్సీబీ మీదుగా ఆర్కే బీచ్‌కు చేరుకుంటారని తెలిపారు.

News December 25, 2024

విశాఖ: ‘యాక్షన్-ప్యాక్డ్ క్షణాలకు సిద్ధంగా ఉండండి’

image

ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it

News December 25, 2024

ఆడారిని వద్దన్న TDP.. రమ్నన్న BJP..!

image

విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ రాజకీయ జీవితం రోజుకో మలుపు తిరుగుతోంది. MLAగా విశాఖ వెస్ట్ నుంచి YCPనుంచి ఓడిపోయిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూటమిప్రభుత్వం వచ్చాక డెయిరీలో అక్రమాలు జరిగాయని జిల్లా TDPనాయకుల ఆరోపణలతో స్పీకర్ విచారణకు ఆదేశించారు. అయితే TDPలో ఆయన చేరేందుకు ప్రయత్నించగా స్థానిక నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో BJPలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.