News May 14, 2024
ఈసారి తగ్గిన పోలింగ్ శాతం
ఉమ్మడి నల్గొండ గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో నల్గొండ పోలింగ్ శాతం 78.7%గా నమోదు కాగా ఈ సారి 73.85% నమోదైంది. భువనగిరి పార్లమెంట్లో గత ఎన్నికల్లో 79.3% నమోదు కాగా, ఈ సారి 76.47% నమోదైంది.
Similar News
News November 28, 2024
డిసెంబర్ 5లోగా ధాన్యం కొనుగోళ్ళను పూర్తి చేయాలి: కోమటిరెడ్డి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఇలా త్రిపాటితో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.
News November 28, 2024
SRPT: విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఇవాళ ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫ్రీ పోస్ట్ మెట్రిక్యులేషన్ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల సంక్షేమ అధికారులు స్థానికంగా ఉంటూ సమస్యలు లేకుండా పరిష్కరించాలని అన్నారు.
News November 27, 2024
NLG: రేపటి డిగ్రీ పరీక్షలు యథాతధం
ఈ నెల 28 (గురువారం) నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీఈవో డా.జి.ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. డిగ్రీ పరీక్షలకు విద్యార్థులంతా హాజరుకావాలని కోరారు.