News March 31, 2024

ఈస్టర్‌ వేడుకకు చర్చిల ముస్తాబు

image

ఏసుక్రీస్తు పునరుత్థానానికి గుర్తుగా జరుపుకునే ఈస్టర్‌ వేడుకలకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. గుడ్‌ ఫ్రైడే తర్వాత మూడో రోజైన ఆదివారం ఈ పండుగ జరగనుండగా.. వేడుకలకు చర్చిలు, మందిరాలను ముస్తాబుచేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించగా.. ఆదివారం ప్రార్థనలకు పెద్దసంఖ్యలో హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News September 30, 2024

ఖమ్మం: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు

image

KMM- NLG- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.

News September 30, 2024

నేడు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్లో ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు.

News September 29, 2024

తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖి

image

తెలంగాణలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఈరోజు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి పొంగులేటి చెప్పారు.