News February 25, 2025
ఉంగుటూరు : వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్

ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం.. మండలంలోని గ్రామానికి చెందిన వివాహిత పెళ్లి వేడుక నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో కలపాల కిరణ్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Similar News
News February 25, 2025
కంచికచర్ల: ప్రమాదంలో ఇద్దరి మృతి.. వివరాలివే..!

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద బైకు అదుపు తప్పి డి వైడర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు ఉయ్యూరు ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), కరిముల్లా(30),లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఉయ్యూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News February 25, 2025
విజయవాడ : వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ భారతి నగర్‌లోని ఇటీవల ఓ బాడీ మసాజ్ సెంటర్లో వైసీపీ ఎస్టీ సంఘం నేత వడిత్య శంకర్ నాయక్ దొరికారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
News February 25, 2025
కృష్ణా : గ్యాస్ ఏజెన్సీలకు డీఎస్ఓ హెచ్చరిక

దీపం-2 పథకం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లకు అదనంగా నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తామని కృష్ణాజిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి హెచ్చరించారు. దీపం-2 పథకం అమలు, ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలు, ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు.