News February 24, 2025

ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 24, 2025

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో బంగ్లా విజయంపైనే పాకిస్థాన్ CT సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
NZ: యంగ్, కాన్వే, విలియమ్సన్, రవీంద్ర, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, సాంట్నర్, హెన్రీ, జెమీసన్, ఓరౌర్కే.
BAN: హసన్, శాంటో, మిరాజ్, హృదయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, జాకర్, రిషద్, తస్కిన్, రాణా, రహ్మన్.

News February 24, 2025

ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకాలు

image

TG: ఆర్టీసీలో డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి సంస్థ సిద్ధమైంది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజిలో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 1,500 మంది నియామకానికి సర్క్యులర్ జారీ చేసింది. 4 నెలల కాలానికే వీరిని నియమించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది 3వేల డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు చేసినా నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది.

News February 24, 2025

SKLM: ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జెడ్పీ మందిరంలో ఈనెల 27న ఉపాధ్యాయ MLC ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఎపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.

error: Content is protected !!