News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2025
పెద్దపల్లి: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య బీమా, రైల్వే పాస్, కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు. నిత్యం వివిధ రాజకీయ నాయకులు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని, వారి కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు.
News February 24, 2025
నల్గొండ: మహాశివరాత్రి.. మరో రెండు రోజులే!

శివరాత్రి వేడుకలు నల్గొండ జిల్లాలో ఘనంగా జరుగుతాయి. నల్గొండలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, బ్రహ్మంగారి గుట్టపై శివాలయం సహా పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయం, దామరచర్ల మండలం వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి దేవాలయాలు జాగారం చేసే శివ భక్తులతో మారుమోగుతాయి. ఇంకా పలు మండలాల్లో శివరాత్రి సందర్భంగా ఎడ్ల పందేలు, క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
News February 24, 2025
KCRకు సవాల్ విసిరిన సీఎం రేవంత్

TG: కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని సవాల్ విసిరారు. ‘కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలుంటే మా సర్వేలో 56 శాతం ఉన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులకు ఎప్పటినుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.