News December 24, 2024
ఉండి: పోలీసుల అదుపులో శ్రీధర్ వర్మ..?
ఉండి మండలంలో సంచలనం రేపిన డెడ్‌బాడీ పార్శిల్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్న తులసి చెల్లెలి భర్త శ్రీధర్మ వర్మ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. తులసి ఇంటికి డెడ్‌బాడీ వచ్చినప్పటి నుంచి ఇతను కనపడకపోవడంతో ఈ కేసులో అన్ని వేళ్లు అతని వైపే చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించగా అతను దొరికినట్లు తెలుస్తోంది. మరి అతను విచారణలో ఏం చెబుతాడనేది ఆసక్తిగా మారింది.
Similar News
News December 25, 2024
హైదరాబాద్‌లో ప.గో.జిల్లా సాప్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాదులో ప.గో.జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన కె. భగవాన్ (26) తన రెంట్ హౌస్‌లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగవాన్‌కు ఫిబ్రవరి నెలలో వివాహం నిశ్చయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు ఎవరు కారణం కాదని లేఖ రాశాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 25, 2024
ఉండి: శ్రీధర్ ఇంట్లో మరో చెక్కపెట్టె..?
డెడ్‌బాడీ పార్శిల్ ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. పర్లయ్యను చంపిన శ్రీధర్ వర్మ.. ఆ డెడ్‌బాడీని ఓ చెక్కపెట్టెలో పెట్టి తులసి ఇంటికి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీధర్ వర్మను విచారిస్తున్న పోలీసులు అతడి ఇంటిని పరిశీలించారు. అక్కడ మరో చెక్కపెట్టె, చేతబడి సామాన్లు దొరికినట్లు తెలుస్తోంది. దేనికోసం రెండో చెక్కపెట్టెను శ్రీధర్ రెడీ చేశాడని ఆసక్తి రేపుతోంది.
News December 25, 2024
అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్ డబ్ల్యూఎస్, ఐసిడిఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మాణ పనులన్నీ తప్పనిసరిగా నాణ్యతతో ఉండాలన్నారు. పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించి, ధృవీకరించాలన్నారు.