News December 25, 2024

ఉండి: శ్రీధర్ ఇంట్లో మరో చెక్కపెట్టె..?

image

డెడ్‌బాడీ పార్శిల్ ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. పర్లయ్యను చంపిన శ్రీధర్ వర్మ.. ఆ డెడ్‌బాడీని ఓ చెక్కపెట్టెలో పెట్టి తులసి ఇంటికి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీధర్ వర్మను విచారిస్తున్న పోలీసులు అతడి ఇంటిని పరిశీలించారు. అక్కడ మరో చెక్కపెట్టె, చేతబడి సామాన్లు దొరికినట్లు తెలుస్తోంది. దేనికోసం రెండో చెక్కపెట్టెను శ్రీధర్ రెడీ చేశాడని ఆసక్తి రేపుతోంది.

Similar News

News December 26, 2024

ఉండి: భార్యల సహకారంతో డెడ్‌బాడీ పార్శిల్..?

image

ఉండి మండలంలో తులసిని బెదిరించడానికి శ్రీధర్ వర్మ పర్లయ్యను చంపి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీధర్ భార్యలు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆయన రెండో భార్య అయిన తులసి చెల్లెలు రేవతి కూడా పార్శిల్ పంపడానికి సహకారం అందించినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె తన నగలు అమ్మేసి డబ్బులు సమకూర్చింది. మూడో భార్య సుష్మ డెడ్‌బాడీని ఆటో డ్రైవర్‌కు ఇవ్వగా ఆయన డోర్ డెలివరీ చేశాడు.

News December 26, 2024

ఏలూరు: 28 నుంచి శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు

image

ఏలూరు ఆర్‌ఆర్‌‌పేట శ్రీవేంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. బుధవారం బ్రహ్మోత్సవాల కరపత్రాలను అర్చకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే జనవరి 18వ తేదీ వరకు శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 25, 2024

పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం శివారు పంపన వారి పాలెం పెట్రోల్ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుమంట్ర గ్రామానికి చెందిన గుబ్బల వెంకటేశ్వరరావు మృతి చెందాడు. వెంకటేశ్వరరావు మోటార్ సైకిల్‌పై పెనుమంట్ర వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.