News March 23, 2025

ఉచిత సామూహిక వివాహాలు: రఘువీరా రెడ్డి

image

మడకశిర మండల పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సామూహిక ఉచిత వివాహాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీలోపు నీలకంఠాపురంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మహిళలకు 18, పురుషులకు 21సంవత్సరాల వయసు నిండినట్లు ఆధారాలను అందజేయాలన్నారు. శాస్త్రోక్తంగా వివాహాలు నిర్వహిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.

Similar News

News March 29, 2025

NZB: అక్రమంగా విక్రయిస్తున్న రెండు గంజాయి పట్టివేత

image

అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.

News March 29, 2025

NZB: కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

image

నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రలో చంద్రకళ(55) అనే మహిళా హత్యకు గురైంది. కూలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన కూతురితో మాట్లాడిన చంద్రకళ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూతురు రమ్య ఇంటికి వచ్చి చూసే సరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 29, 2025

మార్చి 29: చరిత్రలో ఈరోజు

image

1932: కవి కొప్పరపు వేంకట సుబ్బరాయ మరణం
1950: నటుడు ప్రసాద్ బాబు జననం
1952: తెలుగు రచయిత కె.ఎన్‌.వై.పతంజలి జననం
1953: స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు మరణం
1982: నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు
2016: సినీ నిర్మాత కాకిత జయకృష్ణ మరణం

error: Content is protected !!