News February 7, 2025

ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు

image

ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు. 

Similar News

News February 7, 2025

ADB: రేపు పాఠశాలలకు సెలవు లేదు: DEO ప్రణీత

image

రేపు రెండవ శనివారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు లేదని జిల్లా విద్యాధికారి ప్రణీత  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటిస్తూ ఫిబ్రవరి 8 రెండవ శనివారం పని దినంగా ఉంటుందని సర్కులర్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను యదావిధిగా నడపాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె సూచించారు. 

News February 7, 2025

ADB:చైన్ దొంగలించబోయి దొరికిపోయాడు!

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మాధస్తు మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ల బంధువులను చూడడానికి గురువారం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోగా..సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు రిమాండ్‌కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.

News February 7, 2025

ఆదిలాబాద్: బొలెరో వాహనం ఢీ.. ముగ్గురికి గాయాలు

image

ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేష్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.

error: Content is protected !!